Bhatti Vikramarka : మహిళా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : మహిళా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ యాత్ర ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాతో ముగియనుంది. ఇందులో భాగంగా జూలై 2న ఖమ్మంలో జన గర్జన పేరుతో భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తేదీ ఖరారు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరవుతారు.
ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే వెల్లడించారు. ఇదిలా ఉండగా జూలై 1తో పూర్తవుతుంది యాత్ర. ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల సంక్షేమమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు సీఎల్పీ నేత. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
సీఎంగా కేసీఆర్ కొలువు తీరిన తర్వాత మహిళల పట్ల వివక్ష పెరిగిందన్నారు. ప్రధానంగా డ్వాక్రా రుణాలను కావాలని ఆపేశారంటూ ఆరోపించారు. దీని వల్ల మహిళలకు బతుకు దెరువు లేకుండా పోయిందని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
Also Read : Project-K Movie : ప్రాజెక్టు -కె పై భారీ అంచనాలు