Bheemla Nayak Event : సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన భీమ్లా నాయక్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
భీమ్లా నాయక్ టీజర్ ను లాంఛ్ చేశారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ (Bheemla Nayak Event )విడుదల అవుతోంది. మలయాళంలో బిగ్ హిట్ గా నిలిచిన అయ్యప్ప కోషియమ్ కు మాతృకగా ఈ చిత్రాన్ని తీసుకు వచ్చారు మూవీ మేకర్స్.
ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. స్క్రీన్ ప్లే, రచనా సహకారం త్రివిక్రమ్ అందించారు. కాసర్ల శ్యాం, రామ జోగయ్య శాస్త్రి, త్రివిక్రమ్ పాటలు రాశారు. సంగీత విభావరి ఆకట్టుకుంది.
భీమ్లా నాయక్ కు సంబంధించిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ కు భారీ ఆదరణ లభించింది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన నాగర్ కర్నూల్ జిల్లా కిన్నెర మొగులయ్య ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఆయనతో పాటు మంచిర్యాలకు చెందిన కుమ్మరి దుర్గవ్వ హాట్ టాపిక్ గా మారారు. ఆమె కూడా భీమ్లా నాయక్ (Bheemla Nayak Event )చిత్రంలో అమ్మ తల్లి పేరుతో పాట పాడింది. థమన్, శివమణితో కలిసి కేటీఆర్ డ్రమ్స్ వాయించడం విశేషం.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్న సాగర్ వద్ద షూటింగ్ జరపాలని సూచించారు. వాస్తవ కథను తెరకు ఎక్కించామని ఆదరించాలని కోరారు నటుడు పవన్ కళ్యాణ్.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు భీమ్లా నాయక్ ను. నల్లగొండకు చెందిన సాగర్ కు ఈ మూవీ ద్వారా ఛాన్స్ ఇవ్వడం సంతోషమన్నారు కేటీఆర్. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్దమే భీమ్లా నాయక్ అన్నారు.
Also Read : మీ అభిమానం గుండెల్లో పదిలం