Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏమిటో తెలిసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలంగాణలోని నల్లగొండకు చెందిన సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. రచన, సహకారం త్రివిక్రమ్ అందించాడు.
మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కొషియమ్ కు మాతృక ఇది. సితార ఎంటర్ టైన్మెంట్ తో పాటు సూర్య దేవర నాగ వంశీ నిర్మించారు.
సినిమాకు డైలాగులతో పాటు సంగీతం ప్లస్ అయ్యింది. ఇది పక్కా పవన్ ఫ్యాన్స్ కు ఓ టానిక్ లా పని చేసింది. అఖండ మూవీతో దుమ్ము రేపిన ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.
ప్రత్యేకించి సాహిత్యానికి పెద్ద పీట వేశారు. కిన్నెర మొగులయ్య, కుమ్మరి దుర్గవ్వతో పాడించారు.
ఈ సినిమా పాటకు గొంతునిచ్చిన మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.
వకీల్ సాబ్ మూవీ తర్వాత వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ నటించారు. సంక్రాంతికి విడుదల చేస్తామనుకున్నారు.
కానీ కారణంగా వాయిదా వేసి తాజాగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇప్పటికే తనను నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.
తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆధిపత్యానికి ఆత్మ గౌరవానికి మధ్య జరిగే కథే ఇది.
డేనియల్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ మధ్య యుద్దం ఈ చిత్రం. అనుకోకుండా అతడి ఉద్యోగం పోతుంది.
సస్పెండ్ అయ్యాక పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడనేది తెలుసు కోవాలంటే భీమ్లా నాయక్(Bheemla Nayak ) చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా అద్భుతంగా నటించారు. వీరిద్దరూ పోటీ పడి నటించారు. భీమ్లా భార్య గా నీత్యా మీనన్ అద్భుతంగా నటించింది.
ఇక ఐగా శర్మ, బార్ ఓనర్ గా రావు రమేష్ , మాజీ ఎంపీగా సముద్ర ఖని పాత్రల్లో లీనమయ్యారు.
ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగితే సెకండ్ హాఫ్ దుమ్ము రేపేలా చేశాడు దర్శకుడు.
విచిత్రం ఏమిటంటే ఎక్కడా దర్శకుడు హైలెట్ కాలేదు కానీ త్రివిక్రమ్ తీశారని అంతా అనుకోవడం ఇప్పుడు విస్తు పోయేలా చేస్తోంది.
Also Read : మనసు దోచేస్తున్న రాధే శ్యాం సాంగ్