Bhupendra Patel : రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్
ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న పీఎం
Bhupendra Patel : గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఘన విజయాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ. రెండోసారి ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొలువు తీరనున్నారు(Bhupendra Patel). ఈనెల 12న సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు గెలుపొందింది బీజేపీ. ఇది రాష్ట్రంలో ఓ రికార్డు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సీఎంగా గుజరాత్ లో ఉన్న సమయంలో 148 సీట్లు గెలుపొందింది. మొత్తం 182 సీట్లు ఉండగా బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని తమకు ఎదురే లేదని చాటింది.
ఇప్పటి వరకు 27 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇది కూడా ఓ చరిత్రే. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలను ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధానంగా అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని తన భుజాల మీద వేసుకున్నారు. సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉండగా తాజాగా గుజరాత్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ , ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక్క గుజరాత్ , ఉప ఎన్నికల్లో మాత్రమే సత్తా చాటింది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్, ఉప ఎన్నికలు, ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. ఇది ఒక రకంగా కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు.
Also Read : సుస్థిర అభివృద్ది కేంద్రం లక్ష్యం