Sunil Gavaskar : భార‌త జ‌ట్టుకు భువీ అద‌న‌పు బ‌లం

స్టార్ బౌల‌ర్ పై స‌న్నీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

Sunil Gavaskar : భార‌త స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌స్తుత క్రికెట్ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar). క‌ట‌క్ వేదిక‌గా సౌతాఫ్రికా తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఓడి పోయింది.

కానీ భువీ అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. స‌ఫారీ బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప‌రేషాన్ చేశాడు. భార‌త జ‌ట్టుకు భువనేశ్వ‌ర్ కుమార్ అద‌న‌పు బ‌లం కానున్నాడ‌ని పేర్కొన్నాడు స‌న్నీ.

కీల‌క‌మైన వికెట్లు తీసి భువీ స‌త్తా చాటాడ‌ని కితాబు ఇచ్చాడు. త‌న మొద‌టి ఓవ‌ర్ లోనే ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్ ను అద్భుత‌మైన ఇన్ స్వింగ‌ర్ తో అవుట్ చేశాడు.

త‌ర్వాతి ఓవ‌ర్ లో నాకిల్ బాల్ తో డ్వైన్ ప్రిటోరియ‌స్ ను పెవిలియ‌న్ పంపించాడు. ప‌వ‌ర్ ప్లే లో ఆఖ‌రి ఓవ‌ర్ లో రాస్సే వాన్ డ‌స్సెన్ ను ఒకే ఒక్క ప‌రుగుకే ఖంగు తినిపించాడు.

భువీ బౌలింగ్ లో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి ప్ర‌త్య‌ర్థి స‌ఫారీ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయి 29 ప‌రుగులు చేసింది. ఇదిలా ఉండ‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌వ‌ర్ ప్లే లో వ‌రుస‌గా మూడు వికెట్లు తీయ‌డం ప‌దేళ్ల‌లో ఇదే తొలిసారి.

ఈ సంద‌ర్భంగా భువీ చేసిన బౌలింగ్ త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నాడు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar). త్వ‌ర‌లో ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టుకు భువీ అద‌న‌పు బ‌లంగా మార‌నున్నాడ‌ని పేర్కొన్నాడు స‌న్నీ.

Also Read : స‌త్తా చాటుతాం సీరీస్ గెలుస్తాం – పంత్

Leave A Reply

Your Email Id will not be published!