Big Boss Case : బిగ్ బాస్ పై ఫిర్యాదు
నిషేధం విధించాలని డిమాండ్
Big Boss : హైదరాబాద్ – ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ షోపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. షో ముగిసింది. విజేత ఎవరో తేలి పోయింది. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఈ సందర్బంగా చోటు చేసుకున్న గలాటాలో పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. ప్రత్యేకించి వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై దాడులకు దిగారు.
Big Boss Case Viral
అద్దాలను ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎండీ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు బిగ్ బాస్(Big Boss) విన్నర్స్ తో పాటు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు ఎండీ.
తాజాగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ను నిషేధించాలని, నిర్వాహకులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో మరోసారి బిగ్ బాస్ వార్తల్లోకి వచ్చింది.
రోజు రోజుకు వివాదం ఊపందుకుంది. బిగ్ బాగ్ షో వల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వెంటనే చర్యలు తీసుకోక పోతే మరింత రెచ్చి పోయే ప్రమాదం ఉందన్నారు. మరో వైపు విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.
Also Read : AP CM YS Jagan : ఏపీ పెన్షనర్లకు 2750 నుంచి 3వేలకు పెంపు