Naga Vamsi Producer : పుకార్ల‌ను న‌మ్మొద్దు – నిర్మాత

గుంటూరు కారంపై క్లారిటీ

Naga Vamsi : ప్రిన్స్ మ‌హేష్ బాబు, శ్రీ‌లీల క‌లిసి న‌టిస్తున్న గుంటూరు కారం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక రూమ‌ర్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన రెండో సాంగ్ బాగో లేదంటూ మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

Naga Vamsi Producer Comment

మ‌రో వైపు ప్రిన్స్ ఈ సినిమా సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్ ఇస్తున్న మ్యూజిక్ ప‌ట్ల సంతోషంగా లేడ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ చిత్ర నిర్మాత నాగ‌వంశీ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి కానుకగా ఆరు నూరైనా స‌రే గుంటూరు కారం చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌నిగ‌ట్టుకుని కొంద‌రు త‌మ సినిమాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న చెందారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక మ‌హేష్ బాబు , త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఇది ముచ్చ‌ట‌గా మూడో సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను తీసిన అత‌డు, ఖ‌లేజా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ప్ర‌స్తుతం గుంటూరు కారంపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మ‌హేష్ బాబు ఫ్యాన్స్ ఎవ‌రూ కూడా నిరాశ‌కు లోను కావ‌ద్ద‌ని బాక్సులు బ‌ద్ద‌ల‌య్యేలా చిత్రం ఉండ బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు నిర్మాత నాగ‌వంశీ.

Also Read : Big Boss Case : బిగ్ బాస్ పై ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!