రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన శ్రీ స‌త్య

హైద‌రాబాద్ : బిగ్ బాస్ స్టార్ శ్రీ స‌త్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ హీరో రామ్ పోతినేని గురించి తాజాగా స్పందించింది. త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ను లేకుండా నేను ఉండ‌లేనంటూ పేర్కొంది శ్రీ స‌త్య‌. అంతే కాదు త‌న‌కున్న విప‌రీత‌మైన అభిమానాన్ని చాటుకుంది ఈ ముద్దుగుమ్మ‌. బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొంది. ఇదిలా ఉండ‌గా ఉస్తాద్ అనే టైటిల్ ను ప్ర‌క‌టించారు. ఇందులో ముఖ్య భూమిక పోషించాడు రామ్ పోతినేని. త‌ను గ‌త ఏడాది ఆంధ్రా కింగ్ మూవీలో న‌టించాడు. అది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ స‌త్య మాట్లాడుతూ రామ్ పోతినేని సినిమాలో సోద‌రి పాత్ర త‌ప్పా ఏ పాత్ర ఇచ్చినా చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

రామ్ పోతినేని అంటే త‌న‌కు ప్రేమ అని పేర్కొంది. దాదాపు ఏ పాత్రలోనైనా నటించడానికి తాను ఇష్టపడతానని స్ప‌ష్టం చేసింది. సహజంగానే, అవకాశం వస్తే హీరోయిన్‌గా నటించాలని బలమైన కోరికను వ్యక్తం చేసింది. త‌న‌ కెరీర్ గురించి శ్రీ సత్య మాట్లాడుతూ, ఈ మధ్య తనకు టీవీ సీరియల్ ఆఫర్లు పెద్దగా రావడం లేదని తెలిపింది. సరైన స్క్రిప్ట్ తన వద్దకు వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇక శ్రీ స‌త్య ఇప్ప‌టికే జ‌నాద‌ర‌ణ పొందింది. టెలివిజ‌న్ సీరియ‌ల్స్ ల‌లో కూడా న‌టించింది. త‌ను నిన్నే పెళ్లాడుతా, త్రిన‌య‌ని సీరియ‌ల్స్ ల‌లో న‌టించింది.

Leave A Reply

Your Email Id will not be published!