Smriti Irani Daughter Bar : స్మృతీ ఇరానీ కూతురికి బిగ్ షాక్

ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ నోటీసు జారీ

Smriti Irani Daughter Bar : నిత్యం నీతులు వల్లె వేసే కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) త‌న కూతురు విష‌యంలో చిక్కుల్లో ఇరుక్కుంది. ఆమె కూతురు జోయిష్ ఇరానీ ఉత్త‌ర గోవాలోని అస్సాగావ్ లో హైకాస్ రెస్టారెంట్( Bar) న‌డుపుతోంది.

ఇందులో బార్ లైసెన్స్ కూడా తీసుకుంది. విచిత్రం ఏమిటంటే చ‌ని పోయిన వ్య‌క్తి పేరుతో జాయిష్ ఇరాన రిన్యూవ‌ల్ చేయించు కోవ‌డం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. దీనిని ప్ర‌ధాన అస్త్రంగా వాడుకున్నాయి విప‌క్షాలు.

ఇందుకు సంబంధించి గోవా ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ నారాయ‌ణ్ ఎం. గ‌డ్ కేంద్ర మంత్రి కూతురుకు(Smriti Irani Daughter) చెందిన సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ కు 21న షోకాజ్ నోటీసు జారీ చేశారు.

త‌ప్పుడు ప‌ద్ద‌తుల్లో న‌కిలీ పత్రాల ద్వారా ఆమె మ‌ద్యం లైసెన్స్ పొందారంటూ న్యాయ‌వాది ఏరిస్ రోడ్రిగ్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు నోటీసులు జారీ చేయ‌డంతో విస్తు పోయింది కేంద్ర మంత్రి.

గ‌తంలో బార్ లైసెన్స్ అంథోనీ దిగామా పేరు మీద ఉంది. మే 17 , 2021లో ఆయ‌న మ‌ర‌ణించారు. విచిత్రం ఏమిటంటే ఇరానీ కూతురు అత‌డి పేరుతో తిరిగి లైసెన్స్ రిన్యూవ‌ల్ పొందారు.

అస‌లు చ‌ని పోయిన వ్య‌క్తి పేరుతో లైసెన్స్ రిన్యూవ‌ల్ ఎలా పొందుతారంటూ ప్ర‌శ్నించారు. ఆరు నెల‌ల్లో లైసెన్స్ బ‌దిలీ చేస్తామంటూ ఎక్సైజ్ శాఖ‌కు హామీ ఇచ్చారు.

స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం వివ‌రాలు కోరితే అస‌లు బండారం బ‌య‌ట ప‌డింది. ఈ రెస్టారెంట్ కు బార్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ రోడ్రిగ్స్ నిల‌దీశారు.

ప్ర‌స్తుతం స్మృతీ ఇరానీ దీనికి సంబంధించి స‌మాధానం చెప్పేందుకు ముందుకు రాలేదు.

Also Read : యూపీ స‌ర్కార్ అవినీతికి ప‌రాకాష్ట

Leave A Reply

Your Email Id will not be published!