Twist In Meghalaya : మేఘాల‌య ప్ర‌భుత్వ ఏర్పాటులో ట్విస్ట్

ఇద్ద‌రు ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ

Twist In Meghalaya : మేఘాల‌య ప్ర‌భుత్వ ఏర్పాటులో ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎస్పీడీపీ ఎమ్మెల్యేలు సంగ్మా ఎన్పీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. అయితే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు(Twist In Meghalaya) ప్ర‌క‌టించ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ 26 స‌భ్యుల‌తో ఏకైక పార్టీ గా అవ‌త‌రించింది.

ఇదే స‌మ‌యంలో బీజేపీ 2 సీట్లు గెలిచింది. ఆ పార్టీ కూడా కొన్రాడ్ సంగ్మాకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం సీఎం సంగ్మా 32 మంది ఎమ్మెల్యేలు సంతకాలుచేసిన మ‌ద్ద‌తు లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్ కు స‌మ‌ర్పించారు.

నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి ప్రాంతీయ పార్టీగా మేఘాల‌యలో త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే మార్గం స‌జావుగా క‌నిపించడం లేదు. కాన్రాడ్ సంగ్మాకు త‌మ మ‌ద్ద‌తు అందించిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సాంత్రం దానిని ఉప‌స‌హ‌రించు కోవ‌డం విస్మ‌యానికి గురి చేసింది. ఇప్ప‌టికే సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ చౌహాన్ ను కోరారు. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం మార్చి 7న జ‌ర‌గాల‌ని భావిస్తున్నారు.

ఈ లేఖ‌లో ఎన్పీపీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన ఇద్ద‌రు, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్ర‌టిక్ పార్టీ కి చెందిన ఇద్ద‌రు, ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల సంత‌కాలు మ‌ద్ద‌తు లేఖ‌పై ఉన్నాయి. త‌మ‌కు పూర్తి మెజారిటీ ఉంది. బీజేపీ ఇప్ప‌టికే స‌పోర్ట్ తెలిపింది. మ‌రికొంద‌రు కూడా త‌మ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు మేఘాల‌య సీఎం కొన్రాడ్ సంగ్మా.

Also Read : పోరాటం త‌ప్ప పొత్తులుండ‌వు – దీదీ

Leave A Reply

Your Email Id will not be published!