రేప‌టి నుంచి బిగ్ బాస్ 10 రియాల్టీ షో

మ‌రోసారి అక్కినేని నాగార్జుననే హోస్ట్

హైద‌రాబాద్ : వినోద రంగంలో బుల్లితెర‌పై అత్యంత జ‌నాద‌ర‌ణ పొందేందుకు మ‌రోసారి సిద్ద‌మైంది బిగ్ బాస్ 10 రియాల్టీ షో. మ‌రోసారి ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేయ‌నున్నారు ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ఆదివారం గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఎంతో ఉత్కంఠ‌ను రేపుతోంది ఈ షో. ల‌క్ష‌లాది మంది వీక్ష‌కులు దీని కోసం వేచి చూస్తున్నారు. రాత్రి 7 గంట‌ల‌కు స‌రిగ్గా ప్రారంభం కానుంద‌ని నిర్వాహకులు వెల్ల‌డించారు. ఈ షో స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్ లో ప్ర‌త్య‌క్షంగా ప్ర‌సారం అవుతుంది. మరోసారి బిగ్ బాస్ సీజన్ రాబోతుండ‌డంతో ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో అత్యంత ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో తిరిగి ప్రారంభం కానుంది. రాబోయే సీజన్లలో ‘బిగ్ బాస్ తెలుగు 10స మోస్ట్ పాపుల‌ర్ గా నిలిచింది.

ఈ రియాలిటీ షోకు సంబంధించ‌చి తెలుగు వెర్షన్ ఇప్పటికే తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు ‘నేచురల్ స్టార్’ నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, మూడో సీజన్ నుండి అక్కినేని నాగార్జున ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. మైలురాయిగా నిలిచే 10వ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తుండ‌డం విశేషం. 10వ ఎడిషన్‌ను పురస్కరించుకుని నిర్వాహకులు ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ఈ సీజన్‌ను రూపొందించారు. తాజా సమాచారం ప్రకారం ప్రారంభంలో కేవలం 10 మంది పోటీదారులు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు; సీజన్ సాగుతున్న కొద్దీ మిడ్-వీక్ మరియు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరికొందరు సెలబ్రిటీలు ఈ గేమ్‌లో చేరే అవకాశం ఉంది.

సామాన్యులను కూడా ఈ షోలోకి ఎంపిక చేసేందుకు నిర్వాహకులు ‘అగ్ని పరీక్ష’ పేరుతో టాలెంట్ హంట్‌ను నిర్వహిస్తున్నారు. సమాచారం ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు సామాన్యులు కూడా హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇదే సమయంలో, ఖరారైన పోటీదారులుగా పలువురు సెలబ్రిటీల పేర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో వీరు ఉన్నారు. వీరిలో టీవీ న‌టి చైత్ర రాయ్, న‌టి వర్షిణి సౌందరరాజన్, న‌టులు ముకేష్ గౌడ్ , కృష్ణుడు, టెంప‌ర్ వంశీ, జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ న‌రేష్, రామ్ ప్ర‌సాద్ , తెలుగు టీవీ నటుడు ముఖేష్ గౌడ్, ‘చెన్నై లవ్ స్టోరీ’ నటుడు అదిత్ అరుణ్, నటి దేబ్జాని మోదక్
యూట్యూబర్ సుధీర్ రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!