Tejashwi Yadav ED : ఈడీ ముందుకు తేజస్వీ యాదవ్
ల్యాండ్, జాబ్స్ స్కామ్ కేసులో హాజరు
Tejashwi Yadav ED : బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందుకు హాజరవుతున్నారు. తన తండ్రి మాజీ సీఎం, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణంతో ముడి పడి ఉన్న మనీ లాండరింగ్ దర్యాప్తులో తేజస్వీ యాదవ్ ను సీబీఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది.
డిప్యూటీ సీఎంతో పాటు మాజీ సీఎంలు తల్లి రబ్రీదేవి, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారించింది. దీనిపై సీరియస్ గా స్పందించారు తేజస్వీ యాదవ్. ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న నివాసాలలో సోదాలు జరిపింది. భారీ ఎత్తున నగదుతో పాటు బంగారు నగలను స్వాధీనం చేసుకుంది.
ఇందులో భాగంగానే కేసు విచారణ కోసం బీహార్ నుంచి తేజస్వీ యాదవ్(Tejashwi Yadav ED) ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ ముందుకు వెళ్లనున్నారు. అంతకు ముందు సీబీఐ తేజస్వీ యాదవ్ సోదరి మిసా భారతిని గత మార్చి నెలలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అవినీతి, మనీ లాండరింగ్ చోటు చేసుకుందని విచారించింది.
ఇదిలా ఉండగా లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా కేవలం కక్ష సాధింపుతోనే తమపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారంటూ తేజస్వీ యాదవ్ ఆరోపించారు.
Also Read : అవినీతిలో కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటే