Bihar: ఎస్‌ఐఆర్ తో బిహార్ లో ఓట్లకు భారీగా కోత పడే అవకాశం
ఎస్‌ఐఆర్ తో బిహార్ లో ఓట్లకు భారీగా కోత పడే అవకాశం
Bihar : బిహార్‌లో ప్రతిపక్షాలు ఊహించినట్లుగానే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తర్వాత భారీగా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తోంది. బిహార్‌లోని (Bihar) మొత్తం 7.89 కోట్ల మంది ఓటర్లలో… 6.60 కోట్లకు పైగా పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశమున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది.
Bihar Voters Number
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి… ఎన్యూమరేషన్ పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఇంకా 11 రోజుల సమయం ఉంది. ఇప్పటి వరకు 83.66 శాతం ఓటర్ల వివరాలను సేకరించినట్లు తాజాగా ఈసీ వెల్లడించింది. వీరితోపాటు మొత్తం ఓటర్లలో 1.59 శాతం మంది ఓటర్లు మృతి చెందగా… 2.2 శాతం మంది రాష్ట్రం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు. 0.73 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఈ జాబితాను కూడా కలుపుకొని మొత్తం 88.18 శాతం మంది ఓటర్ల గణాంకాలు పూర్తయ్యాయని, ఇంకా 11.82 శాతం ఓటర్ల వివరాలు తెలియాల్సి ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది. తాత్కాలికంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారు… పేపర్‌లో వచ్చిన ప్రకటనల ఆధారంగా… నేరుగా గణాంక పత్రాలను ఎన్నికల సంఘానికి సమర్పించి… ఓటరు జాబితాలో చేరవచ్చని వెల్లడించింది.
Also Read : CJI B R Gavai: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కు అస్వస్థత
