Bikram Singh Majithia : త్వరలోనే శిరోమణి అకాలీదళ్ భారతీయ జనతా పార్టీతో మళ్లీ స్నేహం చేయనుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య బంధం ఉంది. కానీ మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను తీసుకు వచ్చింది.
ఎన్డీయేలో శిరోమణి అకాలీదళ్ భాగస్వామ్యంగా ఉంది. రైతులకు మద్దతుగా కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకుంది పార్టీ. పంజాబ్ లో ఆ పార్టీకి మంచి పట్టుంది. అంతే కాదు ఓ వర్గానికి చెందిన సిక్కులు శిరోమణి అకాలీదళ్ పట్ల అనుకూలంగా ఉన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ప్రధానంగా పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీ నేతలను టార్గెట్ చేసింది. ప్రధానంగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న బిక్రం సింగ్ మాఝితా(Bikram Singh Majithia) కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే తమ పార్టీ తిరిగి భారతీయ జనతా పార్టీతో స్నేహం పెంచుకోనుందని స్పష్టం చేశారు. పంజాబ్ లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. తాము పవర్ లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఒక వేళ ఏకపక్షంగా అధికారం లోకి రాక పోయినా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని విక్రం సింగ్ మాఝితా చెప్పారు. ఇప్పటికే మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
సాగు చట్టాలను రద్దు చేశారు. తాము వారికి మద్దతుగా మంత్రివర్గం నుంచి తప్పుకున్నాం. ఇక చట్టాలు రద్దయ్యాక ఎందుకు బీజేపీతో కలవ కూడదని ప్రశ్నించారు బిక్రం సింగ్ మాఝితా.
Also Read : సోనూ సూద్ వాహనం సీజ్