Bilkis Bano Case : నిన్న బిల్కిస్ రేపు ఎవరో – సుప్రీంకోర్టు
ఇవాళ బిల్కిస్ రేపు ఇంకొకరు
Bilkis Bano Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులు 11 మందిని విడుదల చేయడం కలకలం రేపింది. దీనిపై సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవాళ బిల్కస్ బానో రేపు ఇంకెవరో బలి అయ్యేందుకు రెడీగా ఉండాలా అని మండిపడింది.
11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో కోర్టును ఆశ్రయించారు. అత్యాచారానికి పాల్పడిన దోషుల ఉపశమనానికి సంబంధించిన ఫైళ్లను కోరుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం ఉంది. శిక్షాస్మృతి సమాజానికి సంబంధించిన మనస్సాక్షిని కదిలించిందని పేర్కొంది బిల్కిస్ బానో(Bilkis Bano Case) . 2002 గుజరాత్ అల్లర్లలో ఆమె మూడేళ్ల కూతురుతో సహా బానో కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు.
ఇదిలా ఉండగా శిక్షాస్మృతిలో ఉపయోగించిన ఫైళ్లను చూపాలని మార్చి 27న సుప్రీంకోర్టు గుజరాత్ సర్కార్ కు, కేంద్రానికి సూచించింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్ , బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం 11 మంది దోషులకు వారి ఖైదు కాలంలో మంజూరు చేసిన ఉపశమనాన్ని ప్రశ్నించింది. గత నెలలో శిక్షా కాలం ముగిసిన 11 మంది దోషులలో ఒకరు బీజేపీ ఎంపీ , ఎమ్మెల్యేలతో కలిసి వేదికను పంచుకోవడం కలకలం రేపింది.
Also Read : కబ్జాలు..ఫామ్ హౌస్ లు అబద్దం