Supreme Court : బిల్కిస్ బానో కేసుపై నవంబర్ 29న విచారణ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కామెంట్స్ కలకలం
Supreme Court : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానోకు సంబంధించి 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేసును వచ్చే నెల నవంబర్ 29కి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఆమెపై రేప్, హత్యకు గురి చేసిన ఘటనలో దోషులుగా తేల్చింది కోర్టు. ఆపై జీవిత ఖైదు విధించింది కూడా. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ దేశంలో మహిళలు, యువతులపై సామూహిక హత్యలు, అత్యాచారాలు పెరిగి పోయాయి.
చివరకు దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున రేప్ కు పాల్పడిన వారిలో సత్ ప్రవర్తన వచ్చిందంటూ విడుదలు చేసింది గుజరాత్ బీజేపీ సర్కార్. దానికంటే ముందు కేంద్రం విడుదల చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది.
ఇదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై తమ ప్రతిస్పందనను దాఖలు చేసేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. కౌంటర్ అఫిడవిట్ ను తాను చేడలేదని పేర్కొన్నారు జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ధర్మాసనం.
ఇక గుజరాత్ సర్కార్ దాఖలు చేసిన సమాధానాన్ని అన్ని పక్షాలకు అందుబాటులో ఉంచాలని జస్టిస్ సిటీ రవికుమార్ ఆదేశించారు. ఇదిలా ఉండగా సీపీఎం సీనియర్ నేత సుభాషిణి అలీ, మరో ఇద్దరు మహిళలు దోషల శిక్షను తగ్గించి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేశారు.
Also Read : సివిల్ కోడ్ చట్టం పార్లమెంట్ కే అధికారం