BIMSTEC-2025: బిమ్స్ టెక్ 2025 సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్

బిమ్స్ టెక్ 2025 సదస్సు ప్రారంభించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్

BIMSTEC-2025 : విశాఖ వేదికగా నిర్వహిస్తున్న రెండవ బిమ్స్ టెక్ 2025 (BIMSTEC-2025) సదస్సును కేంద్ర పోర్టులు నౌకా మరియు  జలరవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్  ప్రారంభించారు. విశాఖలో రెండు రోజులు పాటు జరగనున్న ఈ సదస్సుకు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ మరియు అతిద్య భారత్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, BIMSTEC సెక్రటరీ జనరల్, మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, బిమ్‌స్టెక్ సభ్యదేశాల నుండి వచ్చిన అతిథులకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖపట్నం యొక్క వ్యూహాత్మక సముద్ర ప్రాముఖ్యతను వివరించి, పోర్ట్ ఆధారిత పారిశ్రామికీకరణ, డిజిటల్ ఇంటిగ్రేషన్, నౌకాశ్రయ నైపుణ్య అభివృద్ధిలో భాగస్వామ్యం ఆవశ్యకతను వివరించారు.

BIMSTEC-2025 Started

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ గారు మాట్లాడుతూ… ప్రధానమంత్రి విజన్ 2030 & 2047 దిశగా భారత్‌ను సముద్రరంగంలో ప్రపంచంలో అగ్రగామిగా  తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. BIMSTEC దేశాల మధ్య సహకారంతో, మారిటైమ్ డ్యాష్‌బోర్డ్, PPP ఆధారిత పోర్ట్ ఇన్‌ఫ్రా, క్రూయిజ్ టూరిజం, కోస్తా ఎకనామిక్ జోన్‌లు వంటి కార్యక్రమాలు వేగంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే, మారిటైం ట్రాన్స్ పోర్టు అగ్రిమెంట్ ను త్వరలో అమలు చేయాలని పేర్కొన్నారు. “మనమంతా కలిసికట్టుగా, అనుసంధానమైన, స్థిరమైన మరియు శ్రేయస్సు కలిగిన BIMSTEC సముద్ర భవిష్యత్తు వైపు సాగుదాం,” అని ఆయన పిలుపునిచ్చారు.
బిమ్స్ టెక్  ద్వారా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాల మధ్య అనుసంధానం పెరుగుతుందని, మరియు గ్లోబల్ సప్లై చెయిన్‌లను పునర్నిర్మించేందుకు ఇది గొప్ప అవకాశం అని కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్  వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోర్ట్ ఆధారిత అభివృద్ధి వేగంగా జరుగుతుందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం భరత్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుల అభివృద్ధి జరుగుతుందని, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండేలా లక్ష్యంగా ఉన్నట్లు చెప్పారు.
బిమ్స్ టెక్ విజన్ 2030 పై బిమ్‌స్టెక్ సెక్రటరీ జనరల్ శ్రీ ఇంద్ర మణి పాండే గారు ప్రసంగించారు. 267 ప్రాజెక్టులు BIMSTEC ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్‌లో అమలులో ఉన్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలేన్స్ ఇన్ మారిటైం ట్రాన్స్ పోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రియల్ టైమ్ కార్గో ట్రాకింగ్ మరియు గ్రీన్ పోర్ట్ చొరవలు గురించి వివరించారు.
మౌలిక వసతుల లోటు, లాజిస్టిక్స్ , సముద్ర మార్గాల వినియోగం వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. One Nation-One Port Process (ONOPP) ద్వారా ప్రామాణీకరణ, BIMSTEC నైపుణ్య ధృవీకరణ వ్యవస్థ, కోస్టల్ షిప్పింగ్, క్రూయిజ్ టూరిజం వృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని షిప్పింగ్ కార్యదర్శి  టికె రామచంద్రన్ వెల్లడించారు.
విశాఖ పర్యటన లో భాగంగా కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ పలు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశారు.
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్  శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు:
1.పోర్ట్ ఏరియాలో బి-రాంప్ నిర్మాణం – ₹33.49 కోట్లు
2.ఫిషింగ్ హార్బర్‌లో ఫింగర్ జెట్టి మరియు విఫ్ నిర్మాణం – ₹32.61 కోట్లు
3.OSTT వద్ద రెండు అదనపు బ్రీస్టింగ్ డాల్ఫిన్ల నిర్మాణం – ₹20.87 కోట్లు
4.క్రూయిజ్ టెర్మినల్ సమీపంలో ప్రజా ప్రోమెనేడ్ అభివృద్ధి – ₹15.90 కోట్లు
5.అంబేద్కర్ శతాబ్దీ ఫ్లైఓవర్ నుండి L-17 కారిడార్ వరకు అదనపు రాంప్ – ₹8.31 కోట్లు
6.పోర్ట్ ప్రాంతంలో 15 ప్రదేశాల్లో ప్రజల కోసం శౌచాలయాల నిర్మాణం – ₹5.50 కోట్లు
ప్రారంభించబడిన ప్రాజెక్టులు: 
1.నూతన ఆయిల్ రిఫైనరీ బెర్త్-2 ప్రారంభం – ₹42.00 కోట్లు
2.OSTT బెర్త్ వద్ద ఫైర్ ఫైటింగ్ సదుపాయాలు – ₹27.00 కోట్లు
3.R-10 ప్రాంతంలో కవర్డ్ స్టోరేజ్ షెడ్ (200x40x17 మీ.) – ₹22.50 కోట్లు
4.WQ-5 జంక్షన్ నుండి ESSAR జంక్షన్ వరకు రోడ్డు అభివృద్ధి – ₹19.69 కోట్లు
5.కస్టమ్స్ బౌండరీ వాల్ విస్తరణ – ₹7.17 కోట్లు
6.RFID గేట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ – ₹15.00 కోట్లు
7.నూతన పోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ (POS) – ₹10.77 కోట్లు
8.వెసెల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (VTMS) – ₹15.83 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!