Biyyapu Madhusudhan Reddy : బాల‌య్యకు మెంట‌ల్

బియ్యపు మ‌ధుసూద‌న్ రెడ్డి

Biyyapu Madhusudhan Reddy : ఏపీ అసెంబ్లీ వాడి వేడిగా కొన‌సాగుతోంది. శుక్ర‌వారం శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న టీడీపీ స‌భ్యుల‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న శాస‌న స‌భ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఏకి పారేశారు.

Biyyapu Madhusudhan Reddy Comments on Balakrishna

స్పీక‌ర్ కు బియ్య‌పు మ‌దుసూద‌న్ రెడ్డి ఓ సూచ‌న చేశారు. బాల‌కృష్ణ‌కు మెంటల్ ఉంద‌ని, ఆయ‌న స‌భ‌లో ఎవ‌రినైనా ఏమైనా చేయొచ్చ‌ని హెచ్చ‌రించారు. అసెంబ్లీ లోప‌లికి రానిచ్చే ముందు బాల‌కృష్ణ‌కు మెంట‌ల్ (పిచ్చి) ఉందో లేదోన‌న్న స‌ర్టిఫికెట్ చూసి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే.

దీనిపై స్పీక‌ర్ సానుకూలంగా స్పందించారు. అధికారం ఉంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. నేరం చేయ‌లేక పోతే ఆధారాలు బ‌య‌ట పెట్టాల‌ని అన్నారు.

అలా కాకుండా స‌భా స‌మావేశాల‌కు ప‌దే ప‌దే అడ్డు ప‌డ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు బియ్య‌పు మ‌ధుసూద‌న్ రెడ్డి(Biyyapu Madhusudhan Reddy). త‌న తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబును ప‌ట్టుకుని వేలాడుతున్న బాల‌య్య ఇక‌నైనా త‌న త‌ప్పు తెలుసు కోవాల‌ని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే. బాబు ప‌నై పోయింద‌ని ఎద్దేవా చేశారు.

Also Read : Thatikonda Rajaiah : క‌డియంకు జై కొట్టిన తాటికొండ

Leave A Reply

Your Email Id will not be published!