West Bengal Bandh: కోల్ కతా లో బంద్ పిలుపునిచ్చిన బీజేపీ ! హై ఎలర్ట్ ప్రకటించిన దీదీ !
కోల్ కతా లో బంద్ పిలుపునిచ్చిన బీజేపీ ! హై ఎలర్ట్ ప్రకటించిన దీదీ !
West Bengal Bandh: పశ్చిమ బెంగాల్ లోబుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్(West Bengal Bandh) నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బంద్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్‌ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
West Bengal Bandh….
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్ తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. దీనితో బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం.
Also Read : Chhatrapati Shivaji: మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం !