BJP Announce : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ఎంపిక
విజయ శాంతి..రఘునందన్ కు ఛాన్స్
BJP Announce : హైదరాబాద్ – తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా పార్టీ పరంగా ప్రచారం చేపట్టేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా ఇద్దరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మాజీ ఎంపీ విజయ శాంతితో పాటు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించినట్లు వెల్లడించారు.
BJP Announce Campaign Leaders
వీరు పార్టీ తరపున విస్తృతంగా పాల్గొంటారని, పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని, వారి విజయం కోసం కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఈ ఇద్దరికి తెలంగాణ ప్రజలలో మంచి పట్టు ఉందన్నారు. ఇద్దరూ తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
ఇప్పటికే మూడు విడతలుగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు బీజేపీ(BJP) చీఫ్. త్వరలోనే మరికొన్ని సీట్లను కూడా ఖరారు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలుపు చూసి వాపు అనుకుంటోందన్నారు. కానీ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని , బీఆర్ఎస్ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు.
ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీని సీఎం చేస్తానంటూ ప్రకటించిందన్నారు. కానీ మిగతా పార్టీలు అలాంటి నిర్ణయం తీసుకునే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు.
Also Read : Gandhi Bhavan Lock : గాంధీ భవన్ గేట్లకు తాళం