Shashi Tharoor Row : నాపై కాదు వాజ్ పేయ్ పై దాడి
ఎంపీ శశి థరూర్ కీలక కామెంట్స్
Shashi Tharoor Row : పాకిస్తాన్ మాజీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆయనను శాంతి కోసం ప్రయత్నం చేసిన నాయకుడిగా అభివర్ణించారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. శశి థరూర్ చేసిన ట్వీట్ పై భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
ఎంపీని దేశానికి వ్యతిరేకుడంటూ పేర్కొన్నాయి. ఈ సందర్భంగా సీరియస్ గా స్పందించారు శశి థరూర్. తీవ్ర విమర్శలను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. అయితే ఇది తనపై జరిగిన దాడి అనుకోవడం లేదన్నారు. కానీ బీజేపీకి చెందిన మాజీ ప్రధాని , దివంగత అటల్ బిహారీ వాజ్ పేయ్ పై జరిగిన దాడిగా తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు శశి థరూర్(Shashi Tharoor Row) .
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డారు తిరువనంతపురం ఎంపీ. తమ నాయకుడిపై తామే దాడి చేసుకోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు శశి థరూర్. ముషారఫ్ మరణం తర్వాత నిష్కళంకమైన శత్రువులని నేను గుర్తు చేసుకున్నాను. శాంతిని నెలకొల్పేందుకు నాలుగు ఏళ్ల పాటు శ్రమించారు. వాజ్ పేయిపై దాడి చేయాలా వద్దా అనే విషయాన్ని తాను బీజేపీకి వదిలి వేస్తున్నానని తెలిపారు శశి థరూర్.
ముషారఫ్ మనకు సంపూర్ణ శత్రువు. కార్గిల్ కు బాధ్యత వహించాడు. కానీ 2002 తర్వాత ఇది వేరే కథ. ఆనాటి పీఎం వాజ్ పేయి బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై చర్చలు జరిపింది. ఒక సయుక్త ప్రకటన తర్వాత వాజ్ పేయి, ముషారఫ్ ఇద్దరూ కలుసుకున్నారు..కరచాలనం చేసుకున్నారని తెలిపారు.
Also Read : బెదిరింపులకు భయపడను – నితీశ్