BJP Manifesto : ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఉమ్మ‌డి పౌర స్మృతి

భార‌తీయ జ‌న‌తా పార్టీ మ్యానిఫెస్టో

BJP Manifesto : క‌ర్ణాట‌క‌లో ఈనెల 10న జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP Manifesto) మ్యానిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా దీనిని ఆవిష్క‌రించారు. ఈసారి గెలిస్తే క‌ర్ణాటక‌లో యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మ‌డి పౌర స్మృతి)ని అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బీజేపీ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. అవినీతికి కేరాఫ్ గా మారిందంటూ కాంగ్రెస్ ప‌లుమార్లు ఆరోపించింది. దానినే త‌మ ప్ర‌చార అస్త్రంగా మార్చుకుంది కూడా.

త‌మ వాగ్ధానాలు స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గాన్ని తాకుతున్నాయ‌ని పేర్కొంది. త‌యారీ రంగంలో 10 ల‌క్ష‌ల జాబ్స్ క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. బీజేపీ ప్ర‌జా ప్ర‌ణాలికే పేరుతో రూపొందించిన చిత్రాన్ని ఆ పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా ఇవాళ బెంళూరులో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం బ‌స్వరాజ్ బొమ్ఐ , సీనియ‌ర్ పార్టీ నేత , మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప పాల్గొన్నారు.

బీజేపీ మ్యానిఫెస్టో అనంత‌రం మీడియాతో మాట్లాడారు బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా(JP Nadda). ప్ర‌తి ఒక్క‌రికీ ఉపాధి, మెరుగైన పాల‌న అందించ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర అభివృద్ది కోసం కోట్లాది రూపాయ‌లు మంజూరు చేశామ‌న్నారు. ఏ రాష్ట్రానికి లేన‌న్ని నిధులు క‌ర్ణాట‌క‌కు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు జేపీ న‌డ్డా.

దారిద్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న కుటుంబాల‌కు నెల వారీ రేష‌న్ కిట్ లు, షెడ్యూల్డు కులాలు, తెగ‌ల మ‌హిళ‌ల‌కు ఫిక్స్ డ్ డిపాజ్ ప‌థ‌కంతో పాటు క‌ర్ణాట‌క‌ను ఎల‌క్ట్రిక్ వాహ‌నాల హ‌బ్ గ‌గా అభివృద్ది చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Also Read : చంద్ర‌చూడ్ నిర్ణ‌యం రిజిజు సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!