R Shankar Resigns : టికెట్ నిరాకరణ ఎమ్మెల్సీకి రాజీనామా
కర్ణాటకలో కొనసాగుతున్న రాజీనామాలు
R Shankar Resigns : కర్ణాటకలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 189 మందిని తొలి జాబితాలో 23 మందిని రెండో జాబితాలో ఖరారు చేసింది పార్టీ. ఇందులో 52 మంది కొత్త వారిని ఎంపిక చేసింది.
తాజాగా టికెట్ రాని వారిలో ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప, ప్రస్తుత కేబినెట్ లో కొనసాగుతున్న మంత్రి ఎస్ అంగారకు టికెట్ కేటాయించ లేదు. అంతే కాకుండా కనీసం రెండో జాబితాలోనైనా తనకు టికెట్ దక్కుతందని ఆశించిన బీజేపీ ఎమ్మెల్సీ ఆర్. శంకర్ కు నిరాశే మిగిలింది.
ఆయన రెండు జాబితాలలో తన పేరు లేక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ వైపు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ తాను ఇక ఉండలేనంటూ రాజీనామా(R Shankar Resigns) చేశారు. ఈ మేరకు తన రిజైన్ పత్రాన్ని మండలి చైర్మన్ బస్వరాజ్ హోరట్టికి సమర్పించారు. ప్రస్తుతం రాజీనామాలు చేసిన వారిని బుజ్జగించే పనిలో పడింది పార్టీ హైకమాండ్.
కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీకి సాయం చేసిన 17 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో శంకర్ కూడా ఉన్నారు. 2019లో బీఎస్ యడియూరప్ప నాయకత్వంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సాయం చేశాడు. ఆ తర్వాత కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. రాజీనామా అనంతరం ఆర్ శంకర్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీకి ప్రాణం పోసిన వారిలో తాను ఉన్నానని , అయితే తనను బలి తీసుకున్నారంటూ ఆరోపించారు.
Also Read : కర్ణాటక బీజేపీ మంత్రికి దక్కని టికెట్