Gopal Rai : గుజ‌రాత్ లో బీజేపీకి అంత సీన్ లేదు

ఢిల్లీ ఆప్ మంత్రి గోపాల్ రాయ్ ఫైర్

Gopal Rai : గుజ‌రాత్ రాష్ట్రంలో రాజ‌కీయాలు మరింత వేడెక్కాయి. రోజు రోజుకు మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డ త్రిముఖ పోటీ నెల‌కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్యే పోటీ ఉండ‌నుంది. శుక్ర‌వారం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించింది ఎన్నిక‌ల సంఘం.

కానీ ఎందుక‌నో గుజ‌రాత్ లో వెల్ల‌డించ‌లేదు. ఇదిలా ఉండగా గుజ‌రాత్ లో గ‌త 27 సంవ‌త్స‌రాలుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కంటిన్యూగా పాలిస్తూ వ‌స్తోంది. ఇక్క‌డ సీఎంగా ఉన్న న‌రేంద్ర మోదీ(PM Modi) ప్ర‌స్తుతం భార‌త దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్నారు. త‌న స్వంత రాష్ట్రంలో పార్టీని తిరిగి ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేందుకు ఫోక‌స్ పెట్టారు.

ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక బ‌ల‌మైన ఓటు బ్యాంకుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హార్దిక్ ప‌టేల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకున్నారు. ఈ త‌రుణంలో ఓ వైపు మోదీ, అమిత్ షా సుడిగాలిలా ప‌ర్య‌టిస్తుంటే ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇప్ప‌టికే ప‌లుమార్లు రాష్ట్రంలో ప‌ర్య‌టించారు.

ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వ‌మ‌ని కోరుతున్నారు. 27 ఏళ్లు పాలించినా నేటికీ బీజేపీకి చెప్పేందుకు ఏమీ లేద‌న్నారు తాజాగా ఆప్ ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్(Gopal Rai). ఎంత సేపు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌యోగించ‌డం త‌ప్ప ఇంకేమీ సాధించింది లేద‌ని ఎద్దేవా చేశారు.

త‌మ పార్టీకి చెందిన గుజ‌రాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా ను అరెస్ట్ చేయ‌డం పై మండిప‌డ్డారు. త‌న అరెస్ట్ తోనే స‌గం ఓట‌మిని బీజేపీ ఒప్పుకున్న‌ట్ల‌యింద‌ని స్ప‌ష్టం చేశారు గోపాల్ రాయ్. గుజ‌రాత్ లో ఆప్ కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి జంకుతోంద‌న్నారు.

Also Read : ఈసీ ప్ర‌తిపాద‌న‌ల‌పై ఏచూరి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!