Rahul Gandhi : రాజ్యాంగాన్ని క‌బ్జా చేస్తున్న బీజేపీ – రాహుల్

కాషాయ శ్రేణుల నుంచి దేశాన్ని కాపాడుతాం

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)  సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, దాని అనుబంధ సంస్థ‌ల‌న్నీ ఇవాళ దేశంలో మ‌తం, కులం, ప్రాంతం, వ‌ర్గం పేరుతో ప్ర‌జ‌ల‌ను విడ‌దీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ ఆరోపించారు.

దేశానికి ర‌క్ష‌ణ క‌ల్పించే భార‌త రాజ్యాంగాన్ని క‌బ్జా చేయాల‌ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ య‌త్నిస్తున్నాయంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు స్వేచ్చ‌గా ప్ర‌శ్నించేందుకు వీలు లేకుండా చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌శ్నించ‌డం అన్న‌ది రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు. కానీ దేశంలో మోదీ రాజ్యాంగం న‌డుస్తోంద‌న్నారు. వ్యాపార‌వేత్త‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే ఈ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ.

దేశాన్ని బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల చేతుల్లో పెడ‌తామంటే ఊరుకోమ‌న్నారు. ప్ర‌ధానంగా హింస‌ను ప్రేరేపిస్తూ , ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు ఉండేలా చూస్తున్నార‌ని కామెంట్ చేశారు.

వాళ్ల‌కు ఎన్నిక‌ల‌ప్పుడే ఇవ‌న్నీ గుర్తుకు వ‌స్తాయ‌ని ఎద్దేవా చేశారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం దారుణంగా ఉంద‌ని కానీ మోదీకి ఇవ్వ‌న్నీ ప‌ట్ట‌వ‌న్నారు. కేర‌ళ‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi)  మాట్లాడారు.

మ‌న్ కీ బాత్ అంటూ ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్ట‌డంలో ప్ర‌ధాన మంత్రి స‌క్సెస్ అయ్యార‌ని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ప్ర‌ధానంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై దాడికి పాల్ప‌డడం శోచ‌నీయ‌మ‌న్నారు.

ఇవాళ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేద‌న్నారు. సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేద‌న్నారు. ఓ వైపు దాడులు ఇంకో వైపు ధ‌ర‌ల మోత‌ల‌తో జ‌నం బెంబేలెత్తి పోతున్నార‌ని ఆవేద‌న చెందారు రాహుల్ గాంధీ.

Also Read : టైల‌ర్ కిల్ల‌ర్స్ పై కోర్టు ఆవ‌ర‌ణ‌లో దాడి

Leave A Reply

Your Email Id will not be published!