Sonali Phogat : బీజేపీ లీడర్ సోనాలీ ఫోగట్ మృతి
హర్యానాలో పోటీ గోవాలో మరణం
Sonali Phogat : హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందని నాయకురాలు సోనాలీ ఫోగట్ గుండె పోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు 42 ఏళ్లు. సోనాలీ ఫోగట్ 2019 లో జరిగిన హర్యానా ఎన్నికల్లో ఆడంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
అప్పటి కాంగ్రెస్ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేశారు. ఇదిలా ఉండగా ఆమె ప్రముఖ యాంకర్ గా , కంటెస్టెంట్ గా పేరొందారు. రియాల్టీ షో బిగ్ బాస్ 2020 ఎడిసన్ లో సోనాలీ ఫోగట్ పాల్గొంది.
ఆమె తన కొంత మందితో కలిసి గోవాకు వెళ్లింది. అకస్మాత్తుగా ఆమెకు గుండె పోటు రావడంతో మృతి చెందింది. సోనాలీ ఫోగట్(Sonali Phogat) ఉప ఎన్నికల్లో ఆడమ్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య బిష్ణోయ్ గత వారం ఆమెను కలిశారు.
ఇదిలా ఉండగా సోనాలీ ఫోగట్ తన టిక్ టాక్ వీడియోలతో జనాదరణ పొందారు. మరింత పాపులర్ గా మారారు. వీడియో షేరింగ్ యాప్ లో భారీ ఫాలోయింగ్ ఆమె కలిగి ఉన్నారు. 2006లో టీవీ యాంకర్ గా రంగ ప్రవేశం చేశారు.
రెండు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధంకర్ మాట్లాడుతూ సోనాలీ ఫోగట్ మరణం బాధాకరమన్నారు.
హిసార్ దూరదర్శన్ కు యాంకరింగ్ చేయడం , అమీత్ చౌదరి దర్శకత్వం వహించిన ది స్టోరీ ఆఫ్ బద్మాష్ ఘర్ లో కనిపించారు. హర్యానా సినిమాలలో నటించింది.
Also Read : బిల్కిస్ బానోకు పంజాబ్ గాయకుడి భరోసా