BJP Leaders: సచివాలయం వద్ద ఉద్రికత్త ! బీజేపీ నేతలు అరెస్ట్ !
సచివాలయం వద్ద ఉద్రికత్త ! బీజేపీ నేతలు అరెస్ట్ !
BJP : తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. సేవ్ హైదరాబాద్ పేరుతో తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ (BJP) నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.
BJP Leaders Arrest
ఇక, హైదరాబాద్లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. నగర పరిధిలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తుర్కయాంజల్లోనూ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్కు తరలించారు. మరోవైపు సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీవాణి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆమెతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read : Telangana: దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్
