T Raja Singh : ఫారూఖీని తిట్టా ప్రవక్తను అనలేదు
స్పష్టం చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
T Raja Singh : ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని మాత్రమే తాను తిట్టానని కానీ మహ్మద్ ప్రవక్తపై ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే టి. రాజా సింగ్(T Raja Singh).
ఇదిలా ఉండగా ప్రవక్తను తిట్టారంటూ హైదరాబాద్ లో ఎంఐఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. రాజా సింగ్ ను అరెస్ట్ చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పలు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. రాజా సింగ్ ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తాను మొదటి నుంచీ మునావర్ ఫారూఖీని వ్యతిరేకిస్తూ వస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే రాజా సింగ్.
కానీ తెలంగాణ ప్రభుత్వం కావాలని ఫారూఖీతో శిల్ప కళా వేదికలో షో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
కోట్లాది హిందువులు దైవం కంటే ఎక్కువగా ఆరాధించే శ్రీరాముడి , సీతలను కావాలని, పనిగట్టుకుని వ్యంగ్యంగా దూషిస్తూ షోస్ నిర్వహించడాన్ని తాను తీవ్రంగా తప్పు పట్టానని చెప్పారు.
తాను మాట్లాడిన వీడియోను మీరు పూర్తిగా చూస్తే తాను ఏం మాట్లాడాననేది తెలుస్తుందన్నారు. తనను అరెస్ట్ చేసినా మళ్లీ మరో వీడియో విడుదల చేస్తానని ప్రకటించారు.
దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది హైదరాబాద్ లో. పోలీసులను భారీగా మోహరించారు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు.
ఎంఐఎం కావాలని రాజకీయం చేస్తోందంటూ ఆరోపించారు రాజా సింగ్. ఇదంతా ఓ నాటకంగా ఆయన కొట్టి పారేశారు. ప్రస్తుతం రాజా సింగ్(T Raja Singh) కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : ప్రవక్తపై కామెంట్స్ రాజాసింగ్ అరెస్ట్