BJP Protest : భుట్టో కామెంట్స్ పై బీజేపీ నిరసన
దేశ వ్యాప్తంగా ఆందోళన..దిష్టి బొమ్మ దహనం
BJP Protest : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో చేసిన కామెంట్స్ పై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని లోని పాకిస్తాన్ హై కమిషన్ ముందు ఆందోళన చేపట్టారు.
ఇదిలా ఉండగా శనివారం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు(BJP Protest) చేపట్టారు. బిలావల్ భుట్టో జర్దారీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అన్ని రాష్ట్రాల రాజధానులలో పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు రోడ్లపైకి వచ్చారు. నల్ల జెండాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. భారత దేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
అత్యంత అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. భుట్టోకు తగదని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ, ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన తన దేశంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చౌకబారు, నీతి మాలిన కామెంట్స్ చేశారంటూ బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు.
దీంతో పాకిస్తాన్ హై కమిషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా చూస్తోందని పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే సహించ బోమంటూ హెచ్చరించారు.
Also Read : భుట్టో..భారత్ తో పెట్టుకుంటే జాగ్రత్త – సూర్య