BJP : స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ సంచలన ఆరోపణ
స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ సంచలన ఆరోపణ
BJP : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న త్రిభాషా విధానంతో పాటు పార్లమెంట్ డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమౌతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ(BJP) విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీఎంకే కొట్టివేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
BJP Slams
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.1000 కోట్ల లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ(BJP) సంచలన ఆరోపణ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు వెల్లడైందని చెప్పింది. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే త్రిభాషా విధానంపై స్టాలిన్ వదంతులు వ్యాప్తి చేస్తు్న్నారని విమర్శించింది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారంనాడు 2025-26 బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ తరుణంలోనే బీజేపీ తాజా ఆరోపణలకు దిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెనరసు వివిధ సంక్షేమ పథకాలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల అభివృద్ధికి కీలక కేటాయింపులు జరిపారు.ఈ సందర్భంగా ఈడీ దాడుల్లో ఆర్థిక అవకతవకలు, లిక్కర్ స్కా్మ్ వెలుగుచూసినట్టు అన్నాడీఎంకే సభ్యులు ఆరోపిస్తూ, ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభనుంచి సభ్యలు వాకౌట్ చేశారు.
కాగా, TAAMAC, లిక్కర్ మంత్రి, లిక్కర్ సప్లయ్ కంపెనీలపై ఈడీ దాడులు జరుగుతున్నందున ప్రజల దృష్టిని మళ్లించేందుకు త్రిభాషా విధానం, ఎన్ఈపీపై స్టాలిన్ తప్పుడు వదంతలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. ఈడీ దాడుల్లో డిస్ట్రిలరీల నుంచి ముడుపుల రూపంలో వసూలై, లెక్కల్లో చూపించని రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోందని, ఈ అక్రమ చెల్లింపులు ఎవరు అందుకున్నారో సీఎం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, లిక్కర్ స్కామ్ ఆరోపణలపై రూల్ 55 కింద సభలో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు.
లిక్కర్ కుంభకోణంపై మంత్రి సెంథిల్ వివరణ
కాగా, టీఏఎస్‌ఎంఏసీ ఆపరేషన్స్‌లో అవకతవకలకు అవకాశమే లేదని తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. సోదాల పేరుతో ఈడీ దాడులు చేసినప్పటికీ ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారో చెప్పలేదన్నారు. టీఏఎస్ఎంఏసీ రిక్రూట్‌మెంట్‌లో పొరపాట్లు జరిగి ఉండవచ్చనే అభిప్రాయంతో లేనిపోని ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. గత నాలుగేళ్లుగా బార్ టెండర్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే జరుగుతోందని, ఏ ఆధారంతో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని వారు చెబుతున్నారని విపక్షాలను ప్రశ్నించారు. టీఏఎస్ఎంఏసీ టెంబర్‌లో అవకతవకలకు ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఐరన్ రాడ్డుతో విరుచుకుపడిన అగంతకుడు