BJP Slams Congress : దేశంలో రాజకీయం మరింత వేడిని పుట్టిస్తోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఇతర పక్షాలతో కలిసి బలమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే పనిలో పడింది. ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 32 పార్టీలతో ఎన్డీయే సమావేశాన్ని నిర్వహించారు.
BJP Slams Congress
ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించింది బీజేపీ. 1975లో అధికారంపై దురాశతో దేశంలో ఆనాటి పీఎం ఇందిరా గాందీ ఎమర్జెన్సీ విదించిందని తెలిపింది. 1984లో కాంగ్రెస్ పార్టీ సిక్కు వ్యతిరేక అల్లర్లను నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది.
2006లో ఉగ్రవాది యాసిన్ మాలిక్ తో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సమావేశం అయ్యారంటూ మండిపడింది. 2022లో రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారత దేశం పురువు తీశారంటూ మండిపింది. 2023లో కుటుంబం, ఉనికిని కాపాడుకునేందుకు అవినీతి పరులతో కూడిన కూటమి ఏర్పడిందంటూ ధ్వజమత్తింది భారతీయ జనతా పార్టీ.
Also Read : Samuthirakani : పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్