MK Stalin : బీజేపీవి చిల్లర రాజకీయాలు – స్టాలిన్
ఆడియో క్లిప్ వ్యవహారంపై ఆగ్రహం
MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. తమ ఆస్తులకు సంబంధించి ఆర్థిక మంత్రి కామెంట్స్ చేసినట్లు బీజేపీ స్టేట్ చీఫ్ కే. అన్నామలై చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ అంశంపై ఇంతకు మించి మాట్లాడాలని అనుకోవడం లేదంటూ పేర్కొన్నారు సీఎం.
మంగళవారం ఎంకే స్టాలిన్(MK Stalin) మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై, భారతీయ జనతా పార్టీపై, దాని అనుసంధ సంస్థలపై ఫైర్ అయ్యారు. ఈ దేశంలో విద్వేషాల పేరుతో రాజకీయాలను చేస్తూ ఇతర పార్టీలను దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని దీనిని మానుకోవాలని హితవు పలికారు.
రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు ఎంకే స్టాలిన్. పదే పదే ఇదే అంశానికి సంబంధించి ఆర్థిక మంత్రి త్యాగరాజన్ రెండు సార్లు వివరణ ఇచ్చారు. నేను ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేస్తా. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్.
అన్నామలై చేసిన కామెంట్స్ ను పూర్తిగా మంత్రులు త్యాగరాజన్ , ఉదయనిధి స్టాలిన్ ఖండించారని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరోపణలు గుప్పించారని మండిపడ్డారు సీఎం. హిందువులలో ఎక్కువ శాతం బీజేపీని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు ఎంకే స్టాలిన్(MK Stalin).
Also Read : తెర మీదే కాదు తెర వెనుక కూడా నటుడే