Amit Shah : తెలంగాణలో కమలం పాగా ఖాయం
సౌత్ ఎంట్రీకి తెలంగాణ గేట్ వే
Amit Shah : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాగైనా సరే పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రధానంగా పార్టీ చీఫ్ అమిత్ షా ఉన్నప్పటికీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) . అటు ఏపీలో ఇటు తెలంగాణలో పవర్ లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పావులు కదుపుతోంది, వ్యూహాలు పన్నుతోంది బీజేపీ.
జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. దక్షిణాదిలో పాగా వేయాలంటే ముందు తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. అందుకే తాము ఎక్కువగా ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు, వారి అభిరుచులు ఏమిటో తమకు తెలుసన్నారు.
ఎవరిని ఎలా ఎప్పుడు మ్యానేజ్ చేయాలో తమకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు అమిత్ చంద్ర షా(Amit Shah) . రాబోయే ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్యే అసలైన పోటీ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నది లేనే లేదని వాళ్లలో చాలా మంది మంది కమలం వైపు చూస్తున్నారని చెప్పారు
కేంద్ర హోం శాఖ మంత్రి. రాబోయే రోజుల్లో తమను ఎదుర్కోవడం ఎవరికీ చేత కాదన్నారు. మొన్నటికి మొన్న మునుగోడులో తాము నైతికంగా గెలిచామన్నారు. ప్రజలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీని చూస్తున్నారని స్పష్టం చేశారు ట్రబుల్ షూటర్. తెలంగాణలో మార్పు తథ్యమని కుండ బద్దలు కొట్టారు.
Also Read : డ్రెస్ కోడ్ అత్యంత ముఖ్యం – సీజేఐ