BS Yediyurappa : కన్నడ నాట 145 సీట్లు ఖాయం
మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప
BS Yediyurappa : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశాయి. మే 10న బుధవారం రాష్ట్రంలో 224 సీట్లకు సంబంధించి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించు కోవాలని , తాము గెలవడం ఖాయమన్నారు ఈ సందర్భంగా మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప(BS Yediyurappa) .
కనీసం 140 సీట్లకు పైగానే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు మాజీ సీఎం. కొందరు బీజేపీ నుంచి వెళ్లినా తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మెరుగైన ప్రజా పాలనను అందజేసిందని చెప్పారు.
రేపు జరగబోయే పోలింగ్ సరళిని తాను ముందే గ్రహించానని కర్ణాటక ప్రజలు మరోసారి కాషాయ జెండాను ఎగరేసేందుకు సిద్దమై ఉన్నారని స్పష్టం చేశారు బీఎస్ యడ్యూరప్ప. ఇదిలా ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 145 సీట్లు రావాల్సి ఉంటుంది. ఈసారి త్రిముఖ పోటీ జరగనుంది. 13న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Also Read : ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐ కామెంట్స్