Karnataka BJP List : ప‌లువురు ఎమ్మెల్యేల‌కు నో ఛాన్స్

క‌ర్ణాట‌క బీజేపీ అభ్య‌ర్థుల జాబితాలో ట్విస్ట్

క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ మే నెల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ప‌లువురు ఎమ్మెల్యేల‌కు ఈసారి టికెట్లు ద‌క్క‌క పోవ‌చ్చు. బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల స‌మావేశంలో 140 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ 142 సీట్ల‌ను ప్ర‌క‌టించింది.

మొత్తం రాష్ట్రంలో 224 సీట్లు ఉన్నాయి. 140కి పైగా ఏ పార్టీ అయితే సాధిస్తుందో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో త‌ల‌ప‌డ‌నున్నాయి. మ‌రో వైపు జేడీఎస్ , ఎంఐఎం, ఆప్ కూడా బ‌రిలో ఉండ‌నున్నాయి. సోమ‌వారం మ‌రో 40 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది.

2019లో కాంగ్రెస్ , జ‌న‌తాద‌ళ్ సెక్యుల‌ర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రికీ ఎన్నిక‌ల్లో టికెట్లు ల‌భించిన‌ట్లు స‌మాచారం. ఇక సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై 2008 నుండి తాను మ‌రోసారి షిగ్గావ్ స్థానం నుండి బ‌రిలో ఉండ‌నున్నారు.

మాజీ సీఎం , బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు బీఎస్ య‌డ్యూర‌ప్ప త‌న‌యుడు బీవై విజ‌యేంద్ర త‌న తండ్రి సీటు అయిన షికారిపురం నుంచి పార్టీ అభ్య‌ర్థిగా ఎంపిక‌య్యారు. ఇక ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ ఎన్నిక‌ల క‌మిటీ మీటింగ్ కు ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా , ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , బీజేపీ చీఫ్ న‌డ్డా , సీఎం బొమ్మై , కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your Email Id will not be published!