EPS EX CM : ఇదంతా ఎంజీఆర్..అమ్మ ద‌య

ప్రార్థ‌న‌లు ఫ‌లించాయ‌న్న మాజీ సీఎం

EPS EX CM : ఏఐఏడీఎంకే చీఫ్ గా త‌మిళ‌నాడు మాజీ సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి కొన‌సాగేందుకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. గురువారం కీల‌క తీర్పు చెప్పింది. ఈ సంద‌ర్భంగా ఈపీఎస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త సీఎంలు ఎంజీఆర్, కుమారి జ‌యల‌లిత ఆల‌యంలో పూజ‌లు చేశాన‌ని అనంత‌రమే త‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింద‌ని చెప్పారు.

ఇదంతా దైవ సంక‌ల్పిత‌మ‌ని నేను అనుకుంటున్నాన‌ని అన్నారు. రాజ‌కీయాల‌లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. చివ‌ర‌కు ఎవ‌రు కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉండ‌లో అత్యున్న‌త న్యాయ స్థానం తీర్పు చెప్పింది. ఇందుకు నేను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు ఈపీఎస్.

ఇదిలా ఉండ‌గా తీర్పు వెలువ‌డిన వెంట‌నే త‌మిళ‌నాడు చెన్నై లోని రాయ‌పేట‌లోని ఏఐఏడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో సంబురాలు మిన్నంటాయి. అనంత‌రం మధురైలో మాట్లాడారు ఈపీఎస్(EPS EX CM) . పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్బీ ఉద‌య కుమార్ కూతురు పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు.

ఆయ‌న తీవ్ర సంతోషానికి లోన‌య్యారు. అంత‌కు ముందు మ‌ద్రాస్ హైకోర్టు ఇచ్చి న ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ మాజీ సీఎం ఉప ముఖ్య‌మంత్రి ఓ ప‌న్నీర్ సెల్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇవాళ ఈ కేసులో కీల‌క తీర్పు వెలువ‌రించింది. చాలా రోజులు నిద్ర పోలేదు..ఈ తీర్పు కోసం ..ఇవాళ సంతోషంగా ఉన్నాన‌ని అన్నారు ప‌ళ‌నిస్వామి(EPS EX CM) .

నేను కారు ఎక్క‌గానే ఉద‌య్ కుమార్ నాతో ముందు గుడికి వెళ‌దామ‌ని చెప్పాడు. అమ్మ త‌లైవ‌ర్ కి పూల‌మాల వేసి క‌ళ్యాణ మండ‌పానికి వెళ్లాను. శుభ‌వార్త అందింద‌ని అన్నారు మాజీ సీఎం.

Also Read : ష‌ర‌తులు లేని లొంగుబాటు మంచిదే

Leave A Reply

Your Email Id will not be published!