Bomb Blast: బై ఎలక్షన్‌ విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి ! బాలిక మృతి !

బై ఎలక్షన్‌ విజయోత్సాహంతో ప్రత్యర్థుల ఇళ్లపై బాంబుల దాడి ! బాలిక మృతి !

Bomb Blast : పశ్చిమ బెంగాల్‌ లో దారుణం చోటుచేసుకుంది. బై ఎలక్షన్‌ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలు ఓ బాలిక ప్రాణం బలి తీసుకుంది. పార్టీ విజయోత్సవంలో భాగంగా ప్రత్యర్ధి పార్టీల ఇళ్ళపై… ఆ పార్టీ కార్యకర్తలు చేసిన బాంబు దాడిలో (Bomb Blast) ఎనిమిదేళ్ల బాలికి మృతి చెందింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Bomb Blast in West Bengal

పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని నదియా జిల్లా కాళీగంజ్ నియోజకవర్గానికి కొన్ని రోజుల క్రితం బై ఎలక్షన్ జరిగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో కాళీగంజ్ బై ఎలక్షన్లో అధికార తృణముల్ పార్టీ విజయం సాధించింది. దీనితో బై ఎలక్షన్‌లో విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సీపీఎమ్ పార్టీ మద్దతుదారుల ఇళ్లపై నాటు బాంబులు విసిరారు. ఈ నేపథ్యంలోనే ఓ నాటు బాంబు తమన్నా ఖాతూన్ అనే బాలిక దగ్గర పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆ బాలిక చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.

ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో… ‘బారోచంద్ నగర్‌లో సంభవించిన పేలుడులో బాలిక చనిపోయిందని తెలిసి షాక్ అయ్యాను. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ బాలిక కుటుంబంతోటే ఉన్నాయి. పోలీసులు వీలైనంత త్వరగా నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

కాగా, కాళీగంజ్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే నశిరుద్దీన్ అహ్మద్ మరణంతో బై ఎలక్షన్ జరిగింది. ఈ బై ఎలక్షన్‌లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అలిఫా అహ్మద్ గెలుపొందారు. బీజేపీ తరపున ఆశిష్ ఘోష్, కాంగ్రెస్ తరపున కాబిల్ ఉద్దిన్ నిలబడ్డారు. ఈ బై ఎలక్షన్‌ లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీపై అలిఫా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపుపై మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ణతలు తెలియజేశారు.

Also Read : IndiGo: ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Leave A Reply

Your Email Id will not be published!