Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు ! రియాద్ లో సురక్షితంగా ల్యాండింగ్ !
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు ! రియాద్ లో సురక్షితంగా ల్యాండింగ్ !
Bomb Threat : ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హాం నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీనితో అప్రమత్తమైన ఎయిరిండియా సిబ్బంది వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. శనివారం ఈ ఘటన జరగగా ఆ విమానం సౌదీ అరేబియాలోని రియాద్ లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు విమానయాన సంస్థ ఆదివారం రాత్రి ప్రకటించింది. అక్కడి నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయని లేదా ఆలస్యమవుతున్నాయని ఎయిరిండియా తెలిపింది.
Bomb Threat – టేకాఫ్ అయిన కాసేపటికే వెనక్కి వచ్చేసిన విమానం
చెన్నై నుంచి లండన్ బయలుదేరిన అంతర్జాతీయ విమానం… నిర్వహణపరమైన ఇబ్బందులతో టేకాఫ్ అయిన కాసేపటికే చెన్నై తిరిగి వచ్చేసింది. 4 గంటల నిరీక్షణ తర్వాత ఉదయం 11:15 గంటలకు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. ఆదివారం ఈ ఘటన జరగగా ఆ సమయంలో విమానంలో 209 మంది ప్రయాణికులు ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Also Read : YS Jagan : సింగయ్య మృతి కేసులో పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్
