CM Rekha Gupta: ఢిల్లీ సీఎంకు బాంబు బెదిరింపులు ! భద్రత పెంపు !
ఢిల్లీ సీఎంకు బాంబు బెదిరింపులు ! భద్రత పెంపు !
CM Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానంటూ ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీనితో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు… ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ(Delhi) పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. సంబంధిత సిమ్ కార్డు ఓ మహిళ పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఆ సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
CM Rekha Gupta – ఎట్టకేలకు ఢిల్లీ సీఎంకు అధికారిక నివాసం కేటాయింపు
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు(CM Rekha Gupta) అధికారిక నివాసాన్ని గుర్తించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 100 రోజుల తర్వాత ఆమెకు కొత్త బంగ్లాను కేటాయించారు. ఇది ఆమె నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో ఓ బంగ్లాను గుర్తించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్‌కు, సాంఘిక సంక్షేమ మంత్రి రవీంద్ర ఇంద్రరాజ్లకు కూడా ఇక్కడే బంగ్లాలు కేటాయించారు. గతంలో ఆప్ నేత మనీశ్ సిసోదియా ఉన్న మధుర రోడ్డులోని ఇంటిని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ ఇకపై ఉపయోగించనున్నారు. బీజేపీ ప్రభుత్వంలోని కొత్త ఎంపీలందరికీ ఇప్పటికే కొత్త నివాసాలను కేటాయించారు.
సీఎం ప్రస్తుతం షాలిమార్ బాగ్ లోని తన నివాసం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనితో అక్కడికి వచ్చే సందర్శకులు, వీఐపీలు, సీనియర్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక సచివాలయానికి వెళ్లేందుకు రోజూ 25 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి వస్తోంది. ఆమె నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న సివిల్ లైన్స్ లేదా లుటియెన్స్ ప్రాంతాలకు అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా… ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ఆ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా బీజేపీ అభివర్ణించింది. దీనితో ఆ బంగ్లాలోకి వెళ్లేందుకు బీజేపీ సీఎం విముఖత వ్యక్తంచేశారు.
Also Read : Defence Minister Rajnath: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కు ‘మ్యాంగో మ్యాన్’ స్పెషల్ గిఫ్ట్