Indi​‍go : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ! నాగపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ! నాగపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Indi​‍go : ఇటీవల కాలంలో బాంబు బెరిరింపు కాల్స్‌… అధికారులతో పాటు విమాన ప్రయాణీకులను హడలెత్తిస్తున్నాయి. రోజూ దేశంలో ఏదో ఒక చోట బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. మంగళవారం ఉదయం కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో (Indi​‍go) విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. విమాన నంబరును ప్రస్తావిస్తూ… బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నాగ్‌పుర్‌ కు మళ్లించి.. అక్కడ అత్యవసర ల్యాండింగ్‌ చేసారు. అనంతరం విమానంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకి దించేశారు. బాంబు స్క్వాడ్‌ బృందం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. ఈ బెదిరింపు కాల్ పై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Bomb Threats to Indi​‍go

కాగా, అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజుల క్రితం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం బాంబు బెదిరింపుల నేపథ్యంలో యూటర్న్‌ తీసుకుంది. తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎల్‌హెచ్‌752 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జర్మనీ నుంచి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది.

కానీ, ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో ల్యాండింగ్‌కు నిరాకరించారు. భద్రతా దృష్ట్యా, విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికి లేదా సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని సూచించారు. దీనితో లుఫ్తాన్సా విమానం తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం బాంబు బెదిరింపు కారణంగా థాయిలాండ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది.

Also Read : Railway Minister: త్వరలో 200 కొత్త రైళ్లు ! వీడియో షేర్‌ చేసిన రైల్వేమంత్రి !

Leave A Reply

Your Email Id will not be published!