Minister Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటికి బాంబు బెదిరింపు
Nitin Gadkari : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. నాగ్‌పుర్ లోని గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Union Minister Nitin Gadkari gets Bomb Threats
నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. విచారణ అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Also Read : Feeding Pigeons: పావురాలకు తిండి పెడితే ఇకపై జైలుకే !
