Bomb Threat: రాజస్థాన్ సీఎంఓ, జైపూర్ ఎయిర్‌పోర్టు కు బాంబు బెదిరింపు
రాజస్థాన్ సీఎంఓ, జైపూర్ ఎయిర్‌పోర్టు కు బాంబు బెదిరింపు
Bomb Threat : రాజస్థాన్‌లో సీఎం కార్యాలయంతో పాటు జైపూర్ అంతర్జాతీయ విమనాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. గంట లేదా రెండు గంటల్లో సీఎం కార్యాలయం, విమానాశ్రయాంలో బాంబు పేలుళ్లు సంభవిస్తాయని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ ఆ మెయిల్స్‌లో దుండగులు పేర్కొన్నట్లు తెలిపారు.
Bomb Threats to Rajasthan CMO and Jaipur Airport
దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎం కార్యాలయంతో పాటు ఎయిర్‌పోర్టులో యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రెండు చోట్లా ఎలాంటి అనుమానాస్పద వస్తువుల జాడ కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ప్రభుత్వ సెలవు కావడంతో సీఎం కార్యాలయంలో పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది మాత్రమే ఉన్నారు. వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ఇ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో? ఆగంతకులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
Also Read : Operation Sindoor: ప్రత్యేక ‘పాఠం’గా ఆపరేషన్ సిందూర్ ! ఎన్‌సీఈఆర్‌టీ సన్నాహాలు ?
