Bomb Threats to Airports: దేశంలో 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు !
దేశంలో 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు !
Bomb Threats: దేశంలోని 41 ఎయిర్‌పోర్టులకు బెదిరింపు ఈమెయిళ్లు రావడం కలకలం రేపుతోంది. దీనితో రంగంలోనికి దిగిన భద్రతా సిబ్బంది విమానాశ్రయాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. వాటిని నకిలీ బెదిరింపులుగా తేల్చారు. చెన్నై- దుబాయ్ విమానానికీ బాంబు బెదిరింపు రాగా… క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన అనంతరం కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి బయల్దేరింది. ‘‘ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు ఉన్నాయి. త్వరలోనే బాంబులు పేలతాయి. మీరందరూ చనిపోతారు’’ అంటూ అన్ని విమానాశ్రయాలకు దాదాపు ఒకే తరహా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఆ ఈమెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ‘కేఎన్‌ఆర్’ అనే ఆన్‌లైన్ బృందం ఈ నకిలీ బెదిరింపుల వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మే 1న సైతం ఢిల్లీ(Delhi)-ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలలకు ఈ గ్రూప్ ఇదే తరహా ఈమెయిళ్లు పంపినట్లు తెలిపారు.
Bomb Threats to Airports…
తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోని వడోదర, రాజస్థాన్ లోని జైపూర్ 41 విమానాలలో బాంబు హెచ్చరిక ఈమెయిళ్లు వచ్చాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమై దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టామని, ఎలాంటి ఆధారాలు లభించలేదేని సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో టొరంటో వెళ్తున్న టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంటర్‌టైన్మెంట్ కోసం 13ఏళ్ల బాలుడు ఎయిర్ కెనడా విమాన బెదిరింపు ఈమెయిల్‌ను పంపినట్లు అధికారులు గుర్తించారు.
Also Read : Delhi Water Crisis : మా వాటా నీళ్లు మాకివ్వకుంటే సత్యాగ్రహ దీక్ష చేస్తానంటున్న ఆప్ మంత్రి