Jammu-Jodhpur Express: జమ్మూ – జోధ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు !
జమ్మూ - జోధ్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు !
Jammu-Jodhpur Express: జార్ఖండ్ లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఇలా ఉండగా జమ్మూ నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీనితో పంజాబ్ లోని కాసు బేగ్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను దింపి వేసి… రైలులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా బాంబు స్క్వాడ్, ఆగ్నిమాపక దళంతోపాటు వైద్య బృందాలు సైతం కాసు బేగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి.
Jammu-Jodhpur Express – స్పందించిన ఫిరోజ్‌పూర్ ఎస్పీ !
పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ స్టేషన్ దాటిన అనంతరం జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీనితో ఫిరోజ్‌పూర్ కు 10 కిలోమీటర్ల దూరంలోని కాసు బేగ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపి వేశారు. ఈ సందర్బంగా ఫిరోజ్‌పూర్ జిల్లా ఎస్పీ రణధీర్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని… పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ రణధీర్ మాట్లాడుతూ.. పరిస్థితి మొత్తం పూర్తి అదుపులోనే ఉందన్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Also Read : Wayanad Landslides: వయనాడ్ ను ఆదుకోండి ! కేంద్రానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి !