Boris Johnson : రిషి సున‌క్ రాకుండా జాన్సన్ వ్యూహం

ఆయ‌న త‌ప్ప ప్ర‌ధానిగా ఎవ‌రైనా ఓకే

Boris Johnson : తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు రావ‌డంతో స్వంత మంత్రులే ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్సన్ పై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

ఇక సెప్టెంబ‌ర్ 5న బ్రిట‌న్ కు కొత్త‌గా ప్ర‌ధాన మంత్రి కొలువు తీరుతారు. ఈ త‌రుణంలో ప్ర‌వాస భార‌తీయుడు, ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ‌మూర్తి, సుధా మూర్తి ల అల్లుడైన రిషి సున‌క్(Rishi Sunak) ప్ర‌ధాన పోటీదారుగా బ‌రిలో ఉన్నారు.

ఇప్ప‌టికే మొద‌టి రౌండ్ లో ఆయ‌న ముందంజ‌లో ఉన్నారు. మొత్తం 11 మంది పోటీలో ఉండ‌గా చివ‌ర‌కు తొలి రౌండ్ ముగిసే స‌రికి 88 ఓట్ల‌తో ఉన్నా అనూహ్యంగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి పెన్నీ మార్డాంట్ దూసుకు వ‌చ్చారు.

ఆమెకు రాను రాను మ‌ద్ద‌తు పెర‌గ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. రెండో రౌండ్ లో ప్ర‌తినిధులు వీరిలో ఎవ‌రు పీఎంగా ఉండాలో నిర్ణ‌యిస్తారు.

అయితే పీఎంగా రిషి సునక్ త‌ప్ప ఇంకెవరైనా ఉండేలా ప్ర‌స్తుత ఆప‌ద్ద‌ర్మ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రిస్తున్న బోరిస్ జాన్స‌న్ పావులు క‌దుపుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ ప‌త్రిక టైమ్స్ ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. తాను త‌ప్పు కోవ‌డానికి కార‌ణం సున‌క్ అంటూ అందుకే త‌న స్వంత పార్టీ వారినే రిషిని ఓడించాల‌ని కోరుతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

మొత్తం మీద బోరిస్ జాన్స‌న్ (Boris Johnson) మాట నెగ్గుతుందా లేక రిషి సున‌క్ చ‌రిష్మా ప‌ని చేస్తుందా అన్న‌ది చూడాలి.

Also Read : వారం రోజుల్లో శ్రీ‌లంక చీఫ్ ఎన్నిక‌ – స్పీక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!