Botsa Satyanarayana: మూడు రాజధానులపై బొత్స ఆశక్తికరమైన వ్యాఖ్యలు !
మూడు రాజధానులపై బొత్స ఆశక్తికరమైన వ్యాఖ్యలు !
Botsa Satyanarayana : మూడు రాజధానులపై శాసన మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో మూడు రాజధానుల ఏర్పాటు తమ ఎజెండాగా పనిచేసామని… అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. అయితే ఇటీవల ఎన్నికల్లో ప్రజల తీర్పును అనుసరించి మూడు రాజధానులపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని అన్నారు. ఈ అంశంపై పార్టీ నాయకులు, పెద్దలతో సమగ్రంగా చర్చించి రాజధాని లేదా రాజధానుల విషయంలో తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స… ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు.
Botsa Satyanarayana Comments
అయితే మూడు రాజధానులపై చాలా గట్టిగా మాట్లాడే వైసీపీ నాయకులు… ఇప్పుడు తమ నిర్ణయంపై పునరాలోచిస్తామని వెల్లడించడంపై యూ టర్న్ తీసుకుంటారా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై వెనక్కి తగ్గిందా అంచూ చర్చ ప్రారంభమైయింది.
Also Read : CM Revanth Reddy: కేసీఆర్ సంతకం రైతుల పాలిట యమపాశమైంది – సీఎం రేవంత్