Botsa Satyanarayana: పవన్‌ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స ! ఎందుకంటే ?

పవన్‌ కళ్యాణ్ అపాయింట్ మెంట్ కోరిన బొత్స ! ఎందుకంటే ?

Botsa Satyanarayana : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆశక్తికరమైన సంఘటన జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గ్రూఫ్ ఫోటోలు దిగడానికి వెళ్ళిన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత, సీనియర్ వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణలు ఎలా ఉన్నారు అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత గ్రూప్ ఫోటోలు దిగారు. గ్రూప్ ఫోటోలు దిగిన అనంతరం తిరిగి వెళ్తూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కాసేపు మాట్లాడారు. గత ఐదేళ్ళుగా సభా సాంప్రదాయాలు మరచి ఒకరినొకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడిన సందర్భం నుండి… ఇద్దరు ముఖ్య నేతలు కాసేపు మాట్లాడుకోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Botsa Satyanarayana – ఇంతకీ బొత్స… పవన్ తో ఏమి మాట్లాడరంటే ?

గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళుతూ డిప్యూటీ సీఎం పవన్ తో బొత్స(Botsa Satyanarayana) మాట్లాడుతూ… ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు సభకు వస్తారు అని పవన్‌ ను బొత్స అడిగారు. ఎప్పుడు వస్తారో చెపితే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు డెలిగేషన్ వచ్చి కలుస్తుందని తెలిపారు. దీనితో ఎప్పుడు వచ్చేది చెబుతానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా కొల్లేరు వాసుల అభ్యర్థనను డిప్యూటీ సీఎంకు దృష్టికి తీసుకొచ్చారు బొత్స సత్యనారాయణ. సుప్రీం కోర్టులో కేసు వేయడంతో ఈ నెల 9 నుంచి అటవీశాఖ సర్వే నిర్వమిస్తోందని… మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశించిందని చెప్పారు. రేపు అనగా బుధవారం సుప్రీం కోర్టులో కొల్లేరు వ్యాజ్యంపై విచారణ జరుగనుందని… దీనితో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ కారణంగా వారి డేలిగేషన్ వచ్చి కలుస్తారు టైం ఇవ్వాలని బొత్స కోరారు. దీనితో ఢిల్లీ నుంచి రాగానే సమయం ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.

కాగా… ఫొటో సెషన్ ముగించుకుని పవన్(Pawan Kalyan) లోపలికి వెళ్తున్న సమయంలో బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు ఎదురొచ్చి మరీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు. ‘బాగున్నారా… ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ పవన్‌ను బొత్స పలకరించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత తోట త్రిమూర్తులు కూడా పవన్ కలిసి కరచాలనం చేసారు.

ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్‌

ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్‌ నిర్వహించారు. మొదటి వరుసలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫొటో సెషన్‌ జరిగింది.

Also Read : Vijayasai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన సీఐడీ

Leave A Reply

Your Email Id will not be published!