Botsa : దమ్ము ఉంటే సీబీఐతో విచారణ చేయించండి: బొత్స

దమ్ము ఉంటే సీబీఐతో విచారణ చేయించండి: బొత్స

నెయ్యి కల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని మాజీ మంత్రి,వైఎస్‌ఆర్‌సీపీ నేత బొత్ససత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు. ‘నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు? చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్‌ వేసుకున్నారు.కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారు.
ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా..ఇది న్యాయమా.. మాజీ సీఎం తిరుమల వెళ్తానంటే అడ్డుకోవడం దారుణం. చంద్రబాబేమో ఎవరూ అడ్డుకోలేదంటున్నారు.తిరుమల వెళ్తామంటే నోటీసులు ఇచ్చారు.తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.20లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు.పరిపాలన చేయాల్సిందిగా అవకాశమిస్తే మీరు చేస్తున్నదేంటి’అని బొత్స ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!