Bride: పెళ్లిపీటలపై వధువుకు బదులు ఆమె తల్లి ! బిత్తరపోయిన వరుడు !

పెళ్లిపీటలపై వధువుకు బదులు ఆమె తల్లి ! బిత్తరపోయిన వరుడు !

Bride : వంద అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్ళి చేయాలి. అని పెద్దలు ఏ ఉద్దేశ్యంతో అన్నారో గాని… ఇప్పుడు ఆ మాటలకు విపరీతార్ధాలు తీసి పెళ్ళి అనే నూరేళ్ళ బంధాన్ని అబాసు పాలు చేస్తున్నారు నేటి తరం వ్యక్తులు. సరిగ్గా అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని(UP) మేరఠ్‌(Meerut) లో జరిగింది. మరి కొన్ని సెకన్ల మూడు ముళ్ళు వేయాల్సిన వధువు ప్లేస్ లో వధువు తల్లి ఉండటం ఆ వరుడు బిత్తరపోయాడు. వరుడు బంధువులు, వధువు బంధువులతో కుమ్మక్కై ఈ పెళ్ళి చేయాలని చూసినప్పటికీ… ఆఖరి నిమిషంలో తాళి కట్టడానికి ముందు బ్రాహ్మణుడు వధువు పేరు పలకడంతో… వరుడు ఈ విషయాన్ని గమనించి పెళ్ళి నుండి తప్పించుకున్నాడు. అనంతరం తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోనికి వచ్చింది.

Bride Gave Shock

మేరఠ్‌లోని(Meerut) బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్‌ అజీం (22)కు శామలీ జిల్లావాసి మంతశా (21)తో పెళ్లి కుదిరింది. నిఖాలో మౌల్వీ వధువు పేరు ‘తాహిరా’ అని పలకడంతో వరుడికి అనుమానం వచ్చింది. ముసుగు తొలగించి చూడగా… మంతశాకు బదులుగా భర్త చనిపోయిన ఆమె తల్లి (45) వధువు వేషంలో ఉంది. దీనితో షాక్ అయిన అజీం… పెళ్లి పెద్దల్ని ప్రశ్నించాడు. పెళ్లి పెద్దలు సైతం వధువు తల్లికి మద్దతు పలికారు. వధువు తల్లిని పెళ్లి చేసుకోవాల్సిందేనని వరుడిని హెచ్చరించారు. లేదని అల్లరి చేస్తే రేప్‌ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. తాను పూర్తిగా మోసపోయానని గ్రహించిన వరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. అయితే ఈ పెళ్లికి వరుడి తరఫున పెద్దలుగా వ్యవహరించిన అతడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కయినట్లు తెలుస్తోంది.

దీనితో తాను మోసపోయానని గ్రహించిన అజీం… పెళ్లికి రూ.5 లక్షలు ఖర్చు పెట్టానంటూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… పెళ్లి పంచాయితీ పోలీసు స్టేషన్ కు చేరింది. ‘నాకు వధువు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుట్ర చేశారు. పెళ్లి కోసం రూ.5లక్షలు ఖర్చు చేశా. మీరే న్యాయం చేయండి’ అంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

అక్కకు కాదు ఆమె చెల్లినే పెళ్లాడతా అంటూ ఓ వరుడి మారాం

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా మన్‌గవా ఠాణాకు ఓ వింతకేసు వచ్చింది. స్థానిక యువతికి ఈనెల 18న వివాహం జరిగేలా పెద్దలు నిశ్చయించారు. 16న వధువుకు బొట్టు పెట్టే ‘తిలకోత్సవ్‌’ ఘనంగా జరిగింది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు (17న) వధువు తండ్రికి వరుడు ఫోను చేశాడు. ‘‘మీ పెద్దమ్మాయి వద్దు… చిన్నకుమార్తెను పెళ్లాడతా’’ అని బాంబు పేల్చాడు. ఈ మాట వధువు చెవినపడి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయం నుంచి బయటపడి, రీవాలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకోవడంతో… తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. వివాహం ఆగిపోయి, వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. దర్యాప్తు తర్వాత తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని రీవా ఎస్పీ వివేక్‌సింగ్‌ తెలిపారు.

Also Read : CM Omar Abdullah: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

Leave A Reply

Your Email Id will not be published!