BRS Activists: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్

BRS : తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే, ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

BRS Activist attack

ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్(BRS), విద్యార్థి సంఘాల కార్యకర్తలు యత్నించారు. ఈ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తితో నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అదే సమయంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

అధికార పార్టీ తీరు ప్రజా వ్యతిరేకమని, ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా తమ నిరసన తెలుపుతుండగానే పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓస్మానియా యూనివర్శిటీలోనూ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగాయి. పోలీసులు అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసనకారులను అడ్డుకున్నారు.

Also Read : TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

Leave A Reply

Your Email Id will not be published!